Breaking News
Home / Lifestyle / Recipes / చికెన్‌ క్యారెట్‌ కర్రీ

చికెన్‌ క్యారెట్‌ కర్రీ

కావల్సినవి:

చికెన్‌ ముక్కలు – పెద్ద కప్పు, ఉల్లిపాయ -ఒకటి (సన్నగాతరగాలి), క్యారెట్లు – ఆరు (ముక్కల్లా తరగాలి), అల్లంవెల్లుల్లి పేస్టు – చెంచా, పసుపు – కొద్దిగా, ఉప్పు – తగినంత, మిరియాల పొడి -చెంచా, నీళ్లు – రెండు కప్పులు,నూనె -రెండు టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర తరుగు – కొద్దిగా, గరంమసాలా – ½చెంచా.

తయారీ:

బాణలిలో నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించాలి. అందులోనే అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, మిరియాలపొడి, చికెన్‌ ముక్కలు వేసి, నీళ్లు పోసి మూత పెట్టేయాలి. ఐదు నిమిషాలయ్యాక క్యారెట్‌ ముక్కలు, తగినంత ఉప్పు, గరంమసాలా వేసి మళ్లీ మూతపెట్టాలి. ఇరవై అయిదు నిమిషాలకు అన్నీ ఉడుకుతాయి. పైన కొత్తిమీర తరుగు చల్లి బ్రెడ్‌తో కలిపి వడ్డించాలి.

Check Also

ఉగాది శుభాకాంక్షలు

Share this on WhatsAppతీపి ,చేదు కలిసిందే జీవితం….  కష్టం,సుఖం తెలిసిందే జీవితం….. ఆ జీవితం లో ఆనందోత్సాహాలు పూయించేందుకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *