Breaking News
Home / Crime / నా కొడుకు చేసింది తప్పే… కానీ!

నా కొడుకు చేసింది తప్పే… కానీ!

సికింద్రాబాద్ లాలాగూడలో సంధ్యారాణి అనే యువతిని కార్తీక్ అనే ప్రేమోన్మాది పెట్రోల్ పోసి తగుల బెట్టాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సంధ్యారాణి మృతి చెందింది. ఆమె మరణ వాగ్మూలంతో పోలీసులు కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్నారు. కార్తీక్ చేసిన దారుణంపై అతని తల్లి ఊర్మిళ మీడియాతో మాట్లాడింది. తనకు కొడుకు చేసింది తప్పేనని, అయితే అందుకు దారితీసిన పరిణామాలను కూడా పరిశీలించాలని కోరింది. కార్తీక్‌ను తానే పోలీసులకు అప్పగించానని చెప్పింది.

ఈ కేసులో నిందితుడు కార్తీక్ తల్లి మీడియాతో మాట్లాడింది.  ‘నా కొడుకు చేసింది ముమ్మాటికి తప్పే.. వాడికి ఎలాంటి శిక్షవేసినా తప్పులేదు.  కానీ నా కొడుకంటే ఇష్టంలేని సంధ్య.. మరి నా కొడుకు కొనిచ్చిన ఫోన్, ఇతర  వస్తువులను ఎందుకు తీసుకుంది? వాడితో ఎందుకు కలసి తిరిగింది? నాకు కొడుకు తాను సంపాదించిందతా సంధ్యకే ఇచ్చేవాడు.  నా కొడుకుతో మంచిగా ఉన్న  సంధ్య.. తర్వాత  ఆమె బావ తిడుతున్నాడని  నా కొడుకును కలవడం మానేసింది. మళ్లీ కొన్ని రోజులనుంచి సంధ్య నా కొడుకుకు ఫోన్లు చేసేంది. చాటింట్ చేసేది..  సంధ్యమీదున్న  ప్రేమతో నా కొడుకు చీర..పదివేలు పెట్టి ఫోన్ కూడా కొనిచ్చాడు. మరి నాకొడుకంటే ఇష్టంలేకపోతే అవి అప్పుడే తిరిగి ఇచ్చేయచ్చు కదా ఎందుకు తీసుకుంది? కొన్నాళ్లు ప్రేమగా ఉంటూ, కొన్నాళ్లు.. ఇష్టం లేదన్నట్లు ఎందుకుంది? ఆమె మా ఇంటికి వచ్చేది. నాకూ ఆమె అంటే చాలా ఇష్టం.. కానీ ఇలా జరిగాల్సింది కాదు. సంధ్య తనను ప్రేమిస్తోందని మావాడు అనుకున్నాడు.. నిత్యం ఆమెనే తలచుకునేవాడు.. కొన్నాళ్లుగా అన్నం కూడా తినడం లేదు. ఇటీవల ఆత్మహత్యకు కూడ యత్నించాడు.. మా వాడు తప్పు చేశాడు.. కానీ దీనికి ఏది దారితీసింది.. ఫోన్లు.. చాటింగ్.. ఇలాంటివన్నీ..ఆమె చనిపోయినందుకు బాధగా ఉంది’ అని కార్తీక్ తల్లి ఊర్మిళ మీడియాతో చెప్పింది.

‘కార్తీక్ ఇచ్చిన ఫోన్ ఎందుకు తీసుకున్నావ‌ని త‌మ కూతురిని అడ‌గ‌ని సంధ్యారాణి కుటుంబ స‌భ్యులు ఇప్పుడు మాత్రం ఎన్నో మాట్లాడుతున్నారు. నా కొడుకుతో బైకుపై ఆ అమ్మాయి తిరిగేట‌ప్పుడు ..ఆమె కుటుంబ స‌భ్యులు ఎందుకు వ‌ద్దని చెప్పలేదు. అవ‌స‌రం ఉన్నప్పుడు మాత్రం నా కొడుక్కి సంధ్య ఫోన్ చేసేది. ప్రతి రోజు ఛాటింగ్ చేసుకునేవారు, వీడియో కాల్‌లో కూడా మాట్లాడుకునేవారు. ఇందులో ఆ అమ్మాయి తప్పు కూడా ఉంది. తనను పట్టించుకోవడంలేదని  కోపంతోనే నా కొడుకు సంధ్యపై పెట్రోల్ పోశాడు.  ఏది ఏమైనా నాకొడుకు చేసింది  క్షమించరాని తప్పు, వాడికి ఏ శిక్షనైనా వేయండి’ అని తెలిపింది.

Check Also

హుజూర్‌నగర్‌‌లో ఉత్తమ్‌ నామినేషన్‌

Share this on WhatsAppహుజూర్‌నగర్‌: హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్ ప్రత్రాలను రిటర్నింగ్‌ అధికారికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *