Breaking News
Home / Lifestyle / Health & Fitness / యౌవనంగా ఉండలా మీకోసం…

యౌవనంగా ఉండలా మీకోసం…

చిలగడదుంప చర్మంలోని కణాలను గట్టిగా దగ్గరగా పట్టి ఉంచే కొలాజెన్‌ ఉత్పత్తికి విటమిన్‌–సి బాగా దోహదపడుతుంది. ఈ కారణం వల్లనే విటమిన్‌–సి పోషకాలను పుష్కలంగా తీసుకునేవారి చర్మం చాలా కాలం యౌవనంగా ఉంటుంది. దీనిలోనూ  విటమిన్‌–సి పాళ్లు ఎక్కువ. అందుకే దీన్ని తినేవారి చర్మం అంత త్వరగా ఏజింగ్‌ దుష్ప్రభావాలకు గురికాదు.

►చిలగడదుంపలో శరీరంలోని విషాలను బయటకు పంపే గుణం కూడా ఉంది.  ఒత్తిడితో పాటు అనేక కారణాలతో ఒంట్లో పేరుకునే విషాలను కూడా చిలగడదుంప సమర్థంగా తొలగిస్తుంది. ఈ కారణంగానే దీన్ని తినేవారిలో ఏజింగ్‌ ప్రక్రియ చాలా ఆలస్యంగా జరగడం, తద్వారా దీర్ఘకాలం యౌవనంగా ఉండటం సాధ్యపడుతుంది.

►చిలగడదుంపలో ఐరన్‌ పాళ్లు ఎక్కువ. అందుకే రక్తహీనత ఉన్నవారు దీన్ని తీసుకోవడం వల్ల ఒంట్లో రక్తహీనత తగ్గుతుంది. అంతేకాదు… ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాల ఉత్పత్తి పెరుగుతుంది.

►చిలగడదుంపలోని మెగ్నీషియమ్‌… ధమనులు, ఎముకలు, గుండె, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది.

Check Also

ఉల్లికాడల పులావ్‌

Share this on WhatsAppకావలసినవి బాస్మతి బియ్యం- ఒక కప్పు, ఉల్లికాడల తరుగు – మూడు కప్పులు, సోంపు – …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *