Breaking News
Home / States / Andhra Pradesh / రజనీకాంత్‌ కొత్త పార్టీ..

రజనీకాంత్‌ కొత్త పార్టీ..

తాను రాజకీయాలోకి రావడం ఖాయమని, కాలమే దీన్ని నిర్ణయించిందని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అన్నారు. అభిమానులతో ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ ప్రవేశంపై ఆయన ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నిల్లోపే సొంతంగా కొత్త పార్టీ స్థాపిస్తానని తెలిపారు. తమిళనాడులోని 234 స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. యుద్ధం చేస్తా, గెలుపోటములు దేవుడి దయ అని వ్యాఖ్యానించారు. యుద్ధం చేయకపోతే పిరికివాడు అంటారని పేర్కొన్నారు.

డబ్బు కోసమో, పేరు కోసమో రావడం లేదని.. అవన్నీ తనకు ఇప్పటికీ ఉన్నాయని చెప్పారు. దేశంలో రాజకీయాల్లోకి భ్రష్టుపట్టిపోయావని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు తనకు మనస్తాపం కలిగించాయన్నారు. రాజకీయాల్లో వస్తున్నానని రజనీకాంత్‌ ప్రకటించడంతో అభిమానులు పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు చేశారు.

Check Also

షిర్డీలో మహిళకు అవమానం: పోలీసులకు ఫిర్యాదు

Share this on WhatsAppషిర్డీ: మహారాష్ట్రలోని షిర్డీసాయిబాబా ఆలయంలో ఒక మహిళను వేధింపులకు గురిచేసిన ఉదంతం వెలుగు చూసింది. మందిరానికి …

2 comments

  1. I think he only change the Tamilnadu Politics….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *