ఫిల్మ్ న్యూస్: నాగ చైతన్య- తమన్నా ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం 100% లవ్ . తమిళంలో ఈ చిత్రం సుకుమార్ శిష్యుడైన చంద్రమౌళి తెరకెక్కిస్తున్నాడు. తమిళ వర్షెన్ లో జీవి ప్రకాశ్ కుమార్, షాలిని పాండే ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి 100% కాదల్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇటీవల చిత్ర ట్రైలర్ విడుదల కాగా, ఇందులోని సన్నివేశాలు అచ్చం తెలుగు వర్షెన్‌కి సంబంధించినట్టే ఉన్నాయి. తాజాగా ఎన్నడి ఎన్నడి అంటూ సాగే ఎమోషనల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. చిత్రానికి జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అతి త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తాజాగా విడుదలైన సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.