Breaking News
Home / National / కర్ణాటకలో మరో 105 కరోనా కేసులు..

కర్ణాటకలో మరో 105 కరోనా కేసులు..

బెంగుళూరు: కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకూ కర్ణాటకలో 105 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో.. కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1710కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 1080. కరోనా నుంచి కోలుకున్న 17 మందిని శుక్రవారం డిశ్చార్జ్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకూ కర్ణాటకలో 588 మందిని డిశ్చార్జ్ చేశారు. కర్ణాటకలో కరోనా మరణాల సంఖ్య  41కి చేరింది.

Check Also

దేశంలో ఒక్క రోజులో 7,964 మందికి కరోనా…

Share this on WhatsAppభారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఈరోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *