చైనా: చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్ కారణంగా వ్యాధిగ్రస్తులై మృతి చెందిన వారి సంఖ్య 106కు పెరిగింది. సుమారు 4 వేల మందికిపైగా జనంలో కరోనా లక్షణాలను కనుగొన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. దీంతో చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. పలు నగరాలకు రవాణా వ్యవస్థ నిలిపివేశారు. చైనాలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి చికిత్సనందిస్తున్నారు. భారత్కు కూడా కరోనా వైరస్ వ్యాపించినట్లు భావిస్తున్నారు.
