Breaking News
Home / Crime / 12 ఏళ్లలోపు బాలికలను రేప్‌ చేస్తే ఉరి

12 ఏళ్లలోపు బాలికలను రేప్‌ చేస్తే ఉరి

పన్నెండేళ్లలోపు బాలికలను రేప్‌ చేస్తే మరణ దండన విధించేందుకు వీలుగా చట్టాన్ని పదునుదేలుస్తూ కేంద్రం లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టింది. కఠువా, ఉన్నావ్‌ ఘటనల అనంతరం దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తడంతో కేంద్రం ఈ నిబంధనలతో ఓ ఆర్డినెన్స్‌ తెచ్చింది. దాని స్థానే ఇపుడు బిల్లును ప్రవేశపెట్టారు. పన్నెండేళ్ల లోపు చిన్నారులపై అత్యాచారానికి మరణ శిక్ష, 16 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి ఇరవయ్యేళ్ళ శిక్ష, మహిళలను రేప్‌ చేస్తే ఏడేళ్ల నుంచి గరిష్ఠంగా జీవితఖైదు విధించడానికి తాజా బిల్లు వీలు కల్పిస్తోంది. అంటే దోషులు చచ్చేదాకా జైల్లోనే గడపాల్సి ఉంటుందన్నది బిల్లు సారాంశం. అంతేకాదు, రేప్‌ కేసుల దర్యాప్తు, విచారణ అన్నీ రెండు నెలల్లో ముగిసిపోవాలి. అప్పీళ్ల దాఖలు, తీర్పులకు ఆరు నెలల గడువు ఇచ్చారు.

Check Also

షిర్డీలో మహిళకు అవమానం: పోలీసులకు ఫిర్యాదు

Share this on WhatsAppషిర్డీ: మహారాష్ట్రలోని షిర్డీసాయిబాబా ఆలయంలో ఒక మహిళను వేధింపులకు గురిచేసిన ఉదంతం వెలుగు చూసింది. మందిరానికి …

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *