Breaking News
Home / States / 14ఏళ్ల వయసు… నూరేళ్లకు మించిన కష్టాలు!

14ఏళ్ల వయసు… నూరేళ్లకు మించిన కష్టాలు!

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లికి చెందిన నెల్లుట్ల శ్రీనివాస్‌, సుజాత దంపతులకు ఇద్దరు పిల్లలు వైష్ణవి, వాసవి. అనారోగ్య కారణాలతో సుజాత 2017 జూన్‌లో మరణించింది. ఈ విషాదం చోటుచేసుకున్న నెల రోజులకే శ్రీనివాస్‌ చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు, కోడలు చనిపోవడంతో వృద్ధురాలైన ఐలవ్వ ఇద్దరు మనువరాళ్లను అన్నీ తానై పెంచింది. పిల్లల చదువులు ఆగకూడదని కస్తూర్బా పాఠశాలలో చేర్పించింది. ఈ క్రమంలో కిడ్నీలు రెండూ పాడైపోవడంతో చిన్నారులిద్దరినీ అనాథలను చేస్తూ కన్నుమూసింది. ఈ నెల 21న బంధువులు చందాలు వేసుకొని అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి, తండ్రి, నానమ్మ.. ఇలా ముగ్గురికీ వైష్ణవి కర్మకాండలు చేయాల్సి రావడం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. వైష్ణవి, వాసవిల దయనీయ స్థితిని చూసి ప్రతి ఒక్కరూ తల్లడిల్లిపోతున్నారు. దయార్ద హృదయాలు వీరికి అండగా నిలిస్తే గొప్పగా చదువుకొని ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉంటుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *