Breaking News
Home / Politics / హుజూర్ నగర్ లో 144 సెక్షన్….

హుజూర్ నగర్ లో 144 సెక్షన్….

సూర్యాపేట: హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ప్రచార గడువు శనివారం సాయంత్రం 5గంటలకు ముగియడంతో కొన్నిరోజులుగా హోరెత్తించిన రాజకీయ పార్టీల మైకులు మూగబోయాయి. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఈ నెల 21న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక జరగనుంది. 24న ఫలితం వెలువడనుంది.

ఉప ఎన్నిక నేపధ్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా అభ్యర్థులపై ఎన్నికల సంఘం గట్టి నిఘా పెట్టింది. నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో వాహన తనిఖీలు పోలీసులు ముమ్మరం చేశారు. రౌడీ షీటర్లు, పాత నేరస్థుల కదలికలపై నిఘా పెట్టారు. లైసెన్స్ వెపన్స్ స్వాధీనం చేసుకున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *