Breaking News
Home / National / రాజస్థాన్ లో కొత్తగా 150 కరోనా కేసులు…

రాజస్థాన్ లో కొత్తగా 150 కరోనా కేసులు…

జైపూర్: రాజస్థాన్‌లో శుక్రవారంనాడు కొత్తగా 150 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,377కు, మృతుల సంఖ్య 152కు చేరినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇవాళ ఒక్కరోజే 77 మంది పేషెంట్లు పూర్తి స్వస్థతతో ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యారు.

జోధ్‌పూర్ నుంచి 18 పాజిటివ్ కేసులు, పలి నుంచి 15, బార్మెర్ నుంచి 14, ఉదయ్‌పూర్ నుంచి 12, సిరోహి నుంచి 9, సికార్, జలోర్ నుంచి చెరో 5, బిల్వారా, అజ్మీర్ నుంచి తలో నాలుగు, దుంగార్‌పూర్, నాగౌర్ నుంచి చెరి మూడు, బన్సావారా నుంచి చెరో రెండు, రాజసమంద్, జైసల్మేర్ నుంచి ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజా సమాచారం ప్రకారం, దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,18,447కు చేరుకుంది. వీటిలో 66,330 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 48,533 మంది పూర్తిగా కోలుకున్నారు. 3,583 మరణాలు చోటుచేసుకున్నాయి.

Check Also

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం…

Share this on WhatsAppఅమరావతి: సచివాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *