Breaking News
Home / National / బీహార్‌లో 1,923 మందికి డెంగ్యూ జ్వరాలు…

బీహార్‌లో 1,923 మందికి డెంగ్యూ జ్వరాలు…

పాట్నా: భారీవర్షాలు, వరదలతో అల్లాడిన బీహార్ రాష్ట్రంలో డెంగ్యూ, చికున్ గున్యా జ్వరాలు ప్రబలడంతో జనం అల్లాడుతున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో 1923 మందికి డెంగ్యూ జ్వరాలు, మరో 150 మందికి చికున్ గున్యా జ్వరాలు ప్రబలాయని వైద్యులు జరిపిన రక్త పరీక్షల్లో తేలింది. బీహార్ రాజధాని నగరమైన పాట్నాలోనే 1410 మందికి డెంగ్యూ జ్వరాలు రాగా పరిసర ప్రాంతాల్లో 150 మందికి చికున్ గున్యా జ్వరాలు వచ్చాయి. లోతట్టు ప్రాంతాలైన కంకర్ బాగగ్, గార్దిని బాగ్, డాక్ బంగ్లా, ఎస్.కె పురి ప్రాంతాల్లో మురుగునీటి సమస్యతో దోమలు వ్యాప్తి చెందటంతో డెంగ్యూ జ్వరాలు ప్రబలాయి. వరదల అనంతరం డెంగ్యూ, చికున్ గున్యా జ్వరాలు ప్రబలడంతో బీహార్ సీఎం వైద్య ఆరోగ్యశాఖను అప్రమత్తం చేశారు. జ్వరాల బారిన పడిన రోగులకు చికిత్స అందించడంతో పాటు దోమలు వ్యాప్తి చెందకుండా డ్రెయినేజీని శుభ్రం చేయాలని సీఎం నితీష్ కుమార్ ఆదేశించారు. జ్వరాలు ప్రబలిన నేపథ్యంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా ఆసుపత్రిని సందర్శించి వైద్యులతో సమీక్షించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *