Breaking News
Home / National / కర్ణాటకలో కొత్తగా 196 కరోనా కేసులు…

కర్ణాటకలో కొత్తగా 196 కరోనా కేసులు…

బెంగుళూరు: కర్ణాటకలో కోవిడ్ కేసులు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. నేడు ఏకంగా 196 కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,939కి పెరిగింది.  నేడు బెంగుళూరుకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి కోవిడ్ కారణంగా మృతి చెందాడు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 42కు చేరింది. తాజాగా కరోనా మహమ్మారి బారినపడిన వారిలో 172 మంది మహారాష్ట్ర నుంచి వచ్చిన వారని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మిగతా వారిలో ఇద్దరు గుజరాత్ నుంచి రాగా, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు నుంచి వచ్చిన వారిలో ఒక్కొక్కరు వైరస్ బారినపడినట్టు పేర్కొన్నారు. మరో 15 మందికి కోవిడ్ రోగుల ద్వారా సంక్రమించినట్టు తెలిపారు.

Check Also

జూలై 31 వరకు లాక్‌డౌన్

Share this on WhatsAppదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒడిశాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *