Breaking News
Home / National / కరోనా ఉగ్రరూపం

కరోనా ఉగ్రరూపం

దేశంలో ఒక్క రోజులో 19,906 కేసులు.. 410 మంది మృతి
మొత్తం కేసులు 5,28,859.. మరణాలు 16,095
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి కత్తులు దూస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. వరుసగా ఐదో రోజు 15 వేలకుపైగా కేసులు బహిర్గతమయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం దాకా.. కేవలం 24 గంటల వ్యవధిలో ఏకంగా 19,906 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఈ సంఖ్యే అత్యధికం. గత 24 గంటల్లో 410 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.

కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం.. ఇండియాలో ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 5,28,859కు, మరణాలు 16,095కు చేరాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 2,03,051 కాగా, 3,09,712 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. ఇండియాలో జూన్‌ 1 నుంచి 28వ తేదీ వరకు 3,38,324 మంది కరోనా బారినపడ్డారు. ఇప్పటిదాకా 82,27,802 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ప్రకటించింది.

Check Also

మళ్లీ లాక్ డౌన్

Share this on WhatsApp కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీహార్ రాజధాని నగరమైన పట్నాలో ఈ నెల 10 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *