Breaking News
Home / Crime / భద్రాచలంలో 2.80 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం…

భద్రాచలంలో 2.80 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం…

భద్రాచలం: భద్రాచలంలో  పోలీసులు రూ.43 లక్షల విలువైన 2.80 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు గుర్తుతెలియని ఇన్నోవా వాహనంను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా పోలీసులకు ప్రధాన రహదారిలో ఏపీ29ఎఎం4310 అనే ఇన్నోవా వాహనం వేగంగా వెళ్తుండంతో ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఆపకుండా వెళ్లిపోయారు.  ఆ వాహనంను పరిశీలించగా అందులో ప్యాకెట్ల రూపంలో ఉన్న నిషేదిత గంజాయిని రవాణా చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ క్రమంలో దాన్ని పరిశీలించగా రూ.43 లక్షల విలువైన రూ.2.80 క్వింటాళ్ల గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వాహనంను పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *