Breaking News
Home / hyderabad / దేవనార్ ఫౌండేషన్ కు 2 లక్షల విరాళం

దేవనార్ ఫౌండేషన్ కు 2 లక్షల విరాళం

హైదరాబాద్ : గ్రీన్ ఛాలెంజ్ పేరుతో ఇప్పటికే హరిత ఉద్యమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్… ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం బేగంపేటలోని దేవనార్ ఫౌండేషన్ కు వ్యక్తిగతంగా రెండు లక్షల రూపాయల విరాళం అందజేశారు. గతంలో కూడా ఈ ఫౌండేషన్ కు ఎంపీ సంతోష్ సహకరించారు.

గ్రీన్ ఛాలెంజ్ పేరుతో నిర్వహిస్తున్న హరితోద్యమంలో ఇప్పటికే సుమారు 4.50 కోట్ల మొక్కలను సంతోష్‌కుమార్ నాటారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవిదేశాల్లోనూ సినీ, క్రీడా రంగాలతోపాటు అన్ని వర్గాల ప్రముఖులు గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనడాన్ని గౌరవంగా భావిస్తున్న విషయం విదితమే..

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *