తిరుపతి: దక్షిణ మధ్య రైల్వే అధికార వర్గాలు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కాకినాడ టౌన్- తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించాయి. ప్రత్యేక రైళ్ల రాకపోకల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 26న రాత్రి 9 గంటలకు కాకినాడ టౌన్లో ప్రత్యేక రైలు (07210) బయలుదేరి సామర్లకోట, ద్వారపురి, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతూ మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. అదే రోజు ఈ ప్రత్యేక రైలు (07209) తిరుపతిలో రాత్రి 7.30 గంటలకు బయలుదేరి వచ్చిన మార్గంలోనే మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. ఈమేరకు ముందస్తు టికెట్ రిజర్వేషన్ల అవకాశం కల్పించారు.
