జగిత్యాల: అంత్యక్రియలు నిర్వహిస్తుండగా తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన మల్యాల మండలంలోని ముత్యంపేటలో చోటుచేసుకుంది. తేనెటీగలు మూకుమ్మడిగా దాడి చేయడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. సుమారు 20 మందికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం మల్యాల ఆస్పత్రికి తరలించారు.
