బెంగళూరు: ఏపీఎస్ ఆర్టీసీ దసరా పండుగ వేళ సొంత ప్రాంతాలకు వెళ్ళదలచున్న వారికోసం 200 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు ఏటీఎం ఎన్.గోపీనాథ్ తెలిపారు. అకోబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ప్రత్యేక సర్వీసులు ఉంటాయని, ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతానికి వెళ్ళదలచుకున్నా ఈ ప్రత్యేక సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెజస్టిక్ బస్టాండ్, ఐటిఐ గేట్ (దూరవాణినగర్), హెబ్బాళ్, మారతహళ్ళి, విద్యారణ్యపుర ప్రాంతాలలో స్టార్టింగ్ పాయింట్లు ఉన్నాయని తెలిపారు.
విజయవాడ, కాకినాడ, నెల్లూరు, కావలి, తిరుపతి, కనిగిరి, కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల, ఆళ్ళగడ్డ, ప్రొద్దుటూరు ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడపుతున్నట్టు వివరించారు. ప్రయాణీకులు ఆన్లైన్లో టికెట్లు రిజర్వు చేసుకోవచ్చునన్నారు. తిరుపతి, హిందూపురం, చిత్తూరు, కదిరి ప్రాంతాలకు అన్ రిజర్వుడు, ఎక్స్ప్రెస్ సర్వీసులను అదనంగా 50 బస్సులు నడుపుతున్నామన్నారు. ప్రయాణీకులు 99455 16545 / 43 / 44 నెంబర్ల ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చునన్నారు. దసరా వేడుకలు సొంత ప్రాంతాలలో చేసుకోదలిచిన వారికి ప్రయాణంలో ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సౌలభ్యం కల్పించిందన్నారు.