పశ్చిమగోదావరి: పవన్, జగన్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని మంత్రి నారా లోకేష్ అన్నారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ ధర్మపోరాట దీక్షలో లోకేష్ మాట్లాడారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తున్నా.. బీజేపీని పవన్, జగన్ ఒక్క మాట కూడా అనడం లేదన్నారు. వారిద్దరూ కేంద్రంతో రాజీపడి రాష్ట్రానికి నామం పెడుతున్నారని ధ్వజమెత్తారు. అక్టోబర్ 2 నుంచి ముఖ్యమంత్రి యువనేస్తం అమలు చేస్తున్నామని చెప్పారు. నిరుద్యోగులకు నెలకు వెయ్యి చొప్పున భృతి ఇస్తామని ప్రకటించారు. హోదా, రైల్వేజోన్, ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాల్సింది కేంద్రమేనని తెలిపారు. 2019లో బీజేపీకి అసలైన సినిమా చూపిస్తామని లోకేష్ హెచ్చరించారు.
