Breaking News
Home / Crime / హైదరాబాద్‌లో 20 కిలోల ఉల్లి చోరీ…

హైదరాబాద్‌లో 20 కిలోల ఉల్లి చోరీ…

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లి కోసం ప్రజలు మార్కెట్ల వద్ద బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో ధరలతో పాటు ఉల్లి దొంగతనాలు కూడా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌ దోమలగూడలోని జ్యోతినగర్‌లో ఓ వ్యక్తి అర్ధరాత్రి 20 కిలోల ఉల్లి దొంగతనానికి పాల్పడ్డాడు. రోడ్డు పక్కన కూరగాయల దుకాణం నుంచి ఉల్లి చోరీచేశాడు. అరగంటకుపైగా దుకాణం ముందు తచ్చాడి చివరకు ఉల్లితో పారిపోయిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. బంగారం, వెండి లాగే ఉల్లిని భద్రంగా కాపాడుకోవల్సిన పరిస్థితి ఏర్పడిందని దుకాణ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *