Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ‘అగ్రిగోల్డ్‌’కు 270 కోట్లు!

‘అగ్రిగోల్డ్‌’కు 270 కోట్లు!

పదివేల లోపు డిపాజిటర్లకు చెల్లింపు… బాధితుల్లో అసంతృప్తి
అమరావతి: అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లిస్తామన్న మొత్తంలో తొలివిడతగా రూ.270కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ మొత్తంతో రూ.10వేల లోపు డిపాజిటర్లకు మాత్రమే న్యాయం జరగనుంది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై మిగిలిన డిపాజిటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివరాలు… విజయవాడ కేంద్రంగా అగ్రిగోల్డ్‌ సంస్థ సుమారు 8రాష్ట్రాల ప్రజల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించింది. సకాలంలో తిరిగి చెల్లింపులు చేయకపోవడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తును గత ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. బాధ్యులను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు, వారి ఆస్తులను జప్తు చేశారు. విషయం హైకోర్టుకు చేరడంతో ధర్మాసనం సూచనల మేరకు స్థిరాస్తుల వేలానికి చర్యలు చేపట్టినా తగిన స్పందన రాలేదు. ఈ సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేసిన జగన్‌.. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు చేపడతామని హామీ ఇచ్చారు.

సీఎం అయిన తర్వాత అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లలో రూ.20వేలు లోపు ఉన్నవారికి చెల్లింపులు చేస్తామని, అందుకు అవసరమైన రూ.1,150కోట్లు ప్రభుత్వం తక్షణమే విడుదల చేస్తుందని చెప్పారు. అయితే నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఇటీవల అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం ఆందోళన చేపట్టింది. లక్షలాది మంది సమస్య చెప్పేందుకు ప్రయత్నిస్తే తమకు కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని సంఘం నేతలు సీఎంపై నేరుగా ఆరోపణలు చేశారు. దీనిపై సమీక్షించిన ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకుని రూ.10వేల లోపు బాధితులకు న్యాయం చేసేందుకు రూ.270 కోట్ల విడుదలకు పచ్చజెండా ఊపారు. అంతకుమించి ఉన్నవారికి తర్వాత ఇస్తామని చెప్పడంతో బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *