Breaking News
Home / National / ఆందోళన బాటలో 3 ఐఐటీలు

ఆందోళన బాటలో 3 ఐఐటీలు

ఢిల్లీ: ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ), అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయాల (ఏఎంయూ) విద్యార్థుల పట్ల పోలీసుల తీరును నిరసిస్తూ ప్రఖ్యాత విద్యా సంస్థలైన ఐఐటీలకు చెందిన విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఇలాంటి నిరసన కార్యక్రమాలకు ఎప్పుడూ దూరంగా ఉండే ఈ విద్యాసంస్థల విద్యార్థులు తొలిసారి ఇలా ఆందోళనలకు పిలుపునివ్వడం గమనార్హం. ఐఐటీ కాన్పూర్‌, ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ బొంబాయికి చెందిన విద్యార్థులు ఇందులో ఉన్నారు.

”జాదవ్‌పూర్‌ యూనివర్సిటీలో విద్యార్థులపై ప్రతీకార దాడి జరిగినప్పుడు స్పందించలేదు. ఎంటెక్‌ ఫీజులు పెంచినప్పుడు స్పందించలేదు. జేఎన్‌యూ విద్యార్థులపై దాడి జరిగినప్పుడూ నోరుమెదపలేదు. ఇప్పుడు కూడా స్పందించకపోతే విద్యార్థి లోకం పట్ల మనకున్న నిబద్ధత ప్రమాదంలో పడుతుంది. అందుకే విద్యార్థులంతా జేంఎఐ, ఏఎంయూ విద్యార్థులకు మద్దతుగా క్యాంపస్‌లో మార్చ్‌ నిర్వహించాలి” అంటూ ఐఐటీ కాన్పూర్‌ విద్యార్థులు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. మంగళవారం క్యాంపస్‌లో ఆందోళనకు పిలుపునిచ్చారు. ఐఐటీ మద్రాస్‌ విద్యార్థులు సైతం క్యాంపస్‌లోని గజేంద్ర సర్కిల్‌లో ర్యాలీ నిర్వహించాలని సూచించారు. ఐఐటీ బొంబాయి విద్యార్థులు ఆదివారం రాత్రి నిరసన ప్రదర్శన నిర్వహించారు.

పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆగ్నేయ ఢిల్లీలోని న్యూఫ్రెండ్స్‌ కాలనీలో ఆదివారం జేఎంఐ విశ్వవిద్యాలయం విద్యార్థులు, స్థానికులు ఉమ్మడిగా చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. హింసకు పాల్పడిన వారు జేఎంఐ ప్రాంగణంలో తలదాచుకున్నరంటూ విశ్వవిద్యాలయంలో ప్రవేశించిన పోలీసులు తమను కొట్టారని విద్యార్థులు ఆరోపించారు. మరోవైపు ఢిల్లీ ఘటనల నేపథ్యంలో యూపీలోని ఏఎంయూలో ఆదివారం రాత్రి నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థులు పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేసి, బాష్పవాయువు ప్రయోగించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *