Breaking News
Home / States / కల్హేర్ లో 30 పడకల ఆస్పత్రి ప్రారంభం…

కల్హేర్ లో 30 పడకల ఆస్పత్రి ప్రారంభం…

సంగారెడ్డి: జిల్లాలోని కల్హేర్ మండలంలో పర్యటించిన మంత్రి హరీశ్‌రావు మండల కేంద్రంలో నిర్మించిన 30 పడకల ఆస్పత్రిని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్హేర్‌లో రూ. 6 కోట్లతో ఆస్పత్రిని నిర్మించామని, గర్భిణులకు రూపాయి ఖర్చు లేకుండా ప్రసవాలు చేస్తున్నామన్నారు. 30 రోజుల ప్రణాళికలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కల్పిస్తున్న వసతులపై ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కొద్ది రోజుల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని, మనకు నీళ్ల బాధ శాశ్వతంగా దూరం అవుతుందని తెలిపారు. కాళేశ్వరం ద్వారా సింగూరు నింపి తాగు, సాగునీటి కష్టాలు తీరుస్తామని, నారాయణఖేడ్ – సంగారెడ్డి రోడ్డును 4 వరసలుగా విస్తరిస్తామని తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *