Breaking News
Home / Crime / రూ.100 ఇవ్వలేదని 30 సార్లు కత్తితో దాడి….

రూ.100 ఇవ్వలేదని 30 సార్లు కత్తితో దాడి….

ముంబై: వంద రూపాయలు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించడంతో ఓ మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన ముంబైలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైలోని కామాఠిపుర ప్రాంతానికి చెందిన ఓ సెక్స్‌వర్కర్‌తో ఓ వ్యక్తి రూ.500లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే సదరు వ్యక్తి ఆమెను రూ.100 తిరిగి ఇవ్వమన్నాడు. దానికి ఆ మహిళ నిరాకరించడంతో కాసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆ వ్యక్తి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను 30 సార్లు పొడిచి చంపాడు. మహిళ కేకలు విన్న ఓ వ్యక్తి ఆమెను రక్షించడానికి రావడంతో నిందితుడు అతడిని కూడా పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు నిందితుడిని క్యాటరింగ్‌ చేసే వ్యక్తిగా గుర్తించి అరెస్ట్‌ చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *