Breaking News
Home / Film News / నాగార్జున సినిమాకు నేటితో 30 ఏళ్లు పూర్తి…

నాగార్జున సినిమాకు నేటితో 30 ఏళ్లు పూర్తి…

ఫిల్మ్ న్యూస్: టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘శివ’ విడుదలై నేటికి 30 ఏళ్లు. 1989 అక్టోబర్ 5న ఈ సినిమా విడుదలైంది. సైకిల్ చెయిన్‌తో తెలుగు సినీ తెరపై అక్కినేని నాగార్జున సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీలోకి అప్పుడే అడుగుపెట్టిన ఆర్జీవీ.. తెలుగు సినీ పరిశ్రమకు కొత్తదనాన్ని పరిచయం చేశాడు. తొలి అవకాశంతోనే.. తనేంటో నిరూపించుకున్నాడు. శివ సినిమాకు 30 ఏళ్లు పూర్తైన సందర్భంగా దర్శకుడు ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘‘నాగార్జునా.. ఇవాళ మన ప్రియమైన బిడ్డ 30వ పుట్టిన రోజు’’ అని ట్వీట్ చేశాడు.

ముఖ్యంగా శివ సినిమాలో ‘బోటనీ పాఠముంది.. మ్యాటనీ ఆట ఉంది’, ‘సరసాలు చాలు శ్రీవారు’ పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినపడుతూనే ఉంటాయి. ఈ చిత్రాన్ని తమిళ్, హిందీలలో విడుదల చేయగా.. అక్కడా సూపర్ హిట్ అయ్యింది. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎంతో మంది కొత్త దర్శకులకు, నటీనటులకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *