Breaking News
Home / National / 34 మంది చిన్నారులు మృతి

34 మంది చిన్నారులు మృతి

బిహార్: బిహార్‌లో మెదడువాపు వ్యాధి విజృంభిస్తోంది. బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు 34 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ముజఫర్‌పూర్‌లో మెదడువాపు వ్యాధితో బాధపడుతూ జనవరి నుంచి జూన్ 2 వరకు 13 మంది చిన్నారులు ఆసుపత్రిలో చేరగా అందులో ముగ్గురు మరణించారు. కాగా.. జూన్ రెండు నుంచి ఇప్పటి వరకు 86 మంది వ్యాధి బాధితులు ఆసుపత్రిలో చేరారు. అందులో 31 మంది మరణించినట్లు వైద్యులు తెలిపారు. జూన్‌లో ఒక్కసారిగా వ్యాధి బాధితుల సంఖ్య పెరగడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Check Also

తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం

Share this on WhatsAppన్యూఢిల్లీ : 17 వ లోక్ సభ లో తెలంగాణ కు చెందిన సభ్యులు ఎంపీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *