హైదరాబాద్: సుమారు 342 కిలోల సింహాల ఎముకలను సౌతాఫ్రికా పోలీసులు సీజ్ చేశారు. జోహాన్నస్బర్గ్ ఎయిర్పోర్ట్లో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆసియా దేశాల్లో మృగరాజుల ఎముకలకు భారీ డిమాండ్ ఉంది. వాటిని మందుల తయారీలో వాడుతారు. ఈ కేసులో ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఎయిర్పోర్ట్కు వచ్చిన ఓ షిప్మెంట్ను అధికారులు పరీక్షించారు. దాంట్లో 12 బాక్సుల్లో సింహాల ఎముకలు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ అనుమతి ఉంటేనే సింహాల ఎముకలను విదేశాలకు తరలించవచ్చు. సౌతాఫ్రికాలో 11 వేల సింహాలు ఉన్నాయి. దాంట్లో కేవలం 3 వేలు మాత్రమే జాతీయ పార్కుల్లో ఉంటున్నాయి.
