Breaking News
Home / National / భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు 35 ఏళ్లు…

భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు 35 ఏళ్లు…

భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో 35 ఏళ్ల క్రితం చోటుచేసుకున్న గ్యాస్ దుర్ఘటనను ఈ నాటికీ ఎవరూ మరువలేరు. నాటి ప్రమాదంలో చిక్కుకున్న బాధితుల వెతలు ఈ నాటికీ తగ్గలేదు. గడచిన 30 ఏళ్లలో రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలు ఎన్నో మారాయి. అయితే గ్యాస్ బాధితుల పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. పైగా వారికి ఈనాటికీ తగిన సాయం అందకపోవడం విశేషం. చివరికి సరైన తాగునీటి వసతి కూడా లేక వారు అల్లాడిపోతున్నారు. 1984, డిసెంబరు 2, 3 తేదీలలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గల యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) పురుగుమందుల ప్లాంట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో 5 లక్షల మందికిపైగా ప్రజలు మిథైల్ ఐసోసనియేట్ (ఎంఐసీ) వాయువుతో పాటు ఇతర రసాయనాల ప్రభావానికి గురయ్యారు. అప్పట్లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 3,787. కాగా 2006వ సంవత్సరంనాటి ఒక ప్రభుత్వ అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం గ్యాస్ లీకేజీ ప్రభావం 558,125 మందిపై పడినట్టు తెలుస్తోంది. ఇందులో 38,478 మంది తాత్కాలిక ప్రభావానికి, 3,900 శాశ్వత ప్రభావానికి లోనయ్యారు. అలాగే ప్రమాదం జరిగిన రెండువారాలలో 8 వేల మంది మంది మరణించగా, గ్యాస్-సంబంధిత వ్యాధుల కారణంగా మరో 8 వేల మంది మృతి చెందారని అంచనా. భోపాల్‌ గ్యాస్ ప్రమాదానికి గురైన బాధితుల మూడో తరంలోనూ వారిని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *