Breaking News
Home / States / సికింద్రాబాద్‌-పాట్నా మధ్య 4 ప్రత్యేక రైళ్లు…

సికింద్రాబాద్‌-పాట్నా మధ్య 4 ప్రత్యేక రైళ్లు…

సికింద్రాబాద్‌: ఛాత్‌ ఉత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్‌-పాట్నా మధ్య 4 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి సీహెచ్‌.రాకేష్‌ తెలిపారు.

సికింద్రాబాద్‌-పాట్నా జన సాధారన్‌ స్పెషల్‌ ట్రైన్ (రైల్‌ నెంబర్‌: 07639) సికింద్రాబాద్‌ నుంచి అక్టోబర్‌ 29న సాయంత్రం 6.20గంటలకు బయల్దేరి, రెండో రోజు తెల్లవారుజామున 3.00గంటలకు పాట్నా చేరుతుంది. తిరుగు ప్రయాణంలో పాట్నా-సికింద్రాబాద్‌ స్పెషల్‌ ట్రైన్ (రైల్‌ నెంబర్‌: 07640) పాట్నా నుంచి నవంబర్‌ 4న మధ్యాహ్నం ఒంటి గంటకు బయల్దేరి, రెండో రోజు తెల్లవారుజామున 3.00గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది.

సికింద్రాబాద్‌-పాట్నా స్పెషల్‌ ట్రైన్ (రైల్‌ నెంబర్‌: 02791) సికింద్రాబాద్‌ నుంచి అక్టోబర్‌ 30న సాయంత్రం 6.20గంటలకు బయల్దేరి, శుక్రవారం తెల్లవారుజామున 3.00 గంటలకు పాట్నా చేరుతుంది. తిరుగు ప్రయాణంలో పాట్నా-సికింద్రాబాద్‌ స్పెషల్‌ ట్రైన్ (రైల్‌ నెంబర్‌: 02792) పాట్నా నుంచి నవంబర్‌ 5న మధ్యా హ్నం ఒంటి గంటకు బయల్దేరి, రెండో రోజు తెల్లవారుజామున 3.00గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది.

 

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *