Breaking News
Home / States / Andhra Pradesh / విశాఖకు 40 టన్నుల ఉల్లి

విశాఖకు 40 టన్నుల ఉల్లి

నేటి నుంచి మార్కెట్‌ యార్డుల్లో విక్రయం
ఒక్కో యార్డుకు 3 టన్నుల కేటాయింపు
విశాఖపట్నం: గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా రాయితీ ఉల్లిని కిలో రూ.25 చొప్పున పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటివరకు రోజుకు సగటున 20 టన్నుల చొప్పున ఉల్లి రాగా విశాఖపట్నంలోని 13 రైతుబజార్ల ద్వారా సరఫరా చేశారు. గురువారం నుంచి జిల్లాలోని ఏడు మార్కెట్‌ యా ర్డులు(అనకాపల్లి, ఎలమంచిలి, భీమిలి, పాడే రు, చింతపల్లి, నర్సీపట్నం, చోడవరం) ద్వారా మనిషికి కిలో చొప్పున ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అదనంగా మరో 20 ట న్నులు రప్పించారు. నగరానికి గురువారం 40 టన్నుల షోలాపూర్‌ ఉల్లి వచ్చింది. ఒక్కో మా ర్కెట్‌ యార్డుకు మూడు టన్నుల చొప్పున ఇస్తామని మార్కెటింగ్‌ శాఖ ఏడీ కాళేశ్వరరా వు తెలిపారు. ఉల్లి కావాలనుకునేవారు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు తీసుకు వెళ్లాలన్నారు. రాయితీ ఉల్లి కోసం రైతుబజార్లలో కొనుగోలుదారులు బారులు తీరుతున్నారు. గంటకు పై గా నిల్చొంటే కిలో ఉల్లి లభిస్తోంది. అదే ఉల్లి మార్కెట్‌లో రూ.90 పెట్టి కొనాల్సి వస్తోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *