Breaking News
Home / National / మమత కోటలో ముదురుతున్న సంక్షోభం.. 43 మంది వైద్యులు రాజీనామా

మమత కోటలో ముదురుతున్న సంక్షోభం.. 43 మంది వైద్యులు రాజీనామా

కోల్‌కతా: తమకు సంపూర్ణ భద్రత కల్పించేంతవరకూ విధుల్లోకి రామంటూ పశ్చిమబెంగాల్‌లోని మెడికల్ కాలేజీ అండ్ హాస్టిటల్ వైద్యులు చేస్తున్న ఆందోళన తీవ్రతరమైంది. విధుల్లోకి రావాలంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇచ్చిన అల్టిమేటం వైద్యుల ఆగ్రహానికి ఆజ్యం పోసింది. సొంత పార్టీ టీఎంసీలోనూ అసంతృప్తులు మొదలయ్యాయనే సంకేతాలు వెలువడుతుండటంతో ముఖ్యమంత్రి మరింత చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 43 మందికి పైగా వైద్యులు శుక్రవారంనాడు తమ ఉద్యోగాలకు రాజీనామాలు సమర్పించడంతో జూనియర్ డాక్టర్ల సమ్మె ఇవాళ మరింత ముదిరింది. వీరిలో డార్జిలింగ్‌లోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు చెందిన 27 మంది వైద్యులు, కోల్‌కతాలోని ఆర్.జి.నగర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు చెందిన 16 మంది వైద్యులు ఉన్నారు.

ఆసుపత్రి సర్వీసులు సజావుగా సాగించేందుకు తాము చిత్తశుద్ధితో కృషి చేస్తున్నప్పటికీ పేషెంట్ కేర్ సర్వీసులను సాగించడం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత క్లిష్టంగా మారిందని, తాము సేవలు అందించలేని స్థితిలో రాజీనామాలు చేస్తున్నామని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, పశ్చిమబెంగాల్ ఎక్స్ అఫీషియే సెక్రటరీకి అందించిన సామూజిక రాజీనామాల పత్రంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ వైద్యులు పేర్కొన్నారు.

ఈనెల 10న నీల్ రతన్ సర్కార్ (ఎన్ఆర్ఎస్) ఆసుపత్రిలో ఒక పేషెంట్ చికిత్స పొందుతూ మృతిచెందటంతో అతని బంధువులు ఇద్దరు డ్యూటీ డాక్టర్లపై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. దీంతో కొద్దిరోజులుగా సమ్మెకు దిగిన వైద్యులు, ప్రతి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తగిన భద్రత కల్పించాలని గట్టి డిమాండ్ చేస్తున్నారు. వైద్యులు ఆందోళన విరమించి విధులకు హాజరుకావాలంటూ తొలుత విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి, ఆ తర్వాత అల్టిమేటం ఇవ్వడంతో పరిస్థితి మరింత విషమించింది. దీంతో పలువురు వైద్యులు సామూహిక రాజీనామాలకు దిగుతుండగా, వారికి దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ ఫెటర్నిటీ సైతం సంఘీభావం చాటుతోంది. పశ్చిమబెంగాల్‌లో వైద్యసైవలకు తీవ్ర అంతరాయం కలుగుతుండగా, ఇతర రాష్ట్రాల్లోనూ టోకెన్ సమ్మెలు మొదలయ్యాయి.

Check Also

మంగల్‌ పాండే వివాదాస్పద వ్యాఖ్యలు

Share this on WhatsAppపట్నా: బీహార్ లో మెదడువాపు వ్యాధి బారిన పడి 103 మంది చిన్నారు మృతి చెందిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *