Breaking News
Home / Crime / 43 మంది మృతి.. పలువురికి గాయాలు…

43 మంది మృతి.. పలువురికి గాయాలు…

ఢిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఝాన్సీరాణి రోడ్డులో ఓ పరిశ్రమలో ఆదివారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదం అనేక మంది జీవితాలను బుగ్గిపాలు చేసింది. ఈ ఘటనలో 43 మంది దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మంది కాలిన గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాద తీవ్రత భారీగా ఉండడం, ప్రమాద ప్రదేశం ఇరుకుగా ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలిగింది. దీంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. అంతకు ముందు దాదాపు 30వరకు అగ్నిమాపక యంత్రాలు మంటల్ని ఆర్పేందుకు, బాధితుల్ని రక్షించడానికి తీవ్రంగా శ్రమించాయి. వారి కృషితో దాదాపు 63 మంది సురక్షితంగా బయటపడ్డారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *