Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఏపీలో మరో 44 కరోనా కేసులు…

ఏపీలో మరో 44 కరోనా కేసులు…

అమరావతి : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 9గంటల వరకూ 10,240 మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా 44మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ మీడియా బులెటిన్‌లో పేర్కొంది. దీంతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 2,621కు చేరింది. సోమవారం నాడు 41 మంది పలు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 1848 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 56 కరోనా మరణాలు సంభవించాయి.

ప్రస్తుతం ఏపీలో యాక్టివ్‌ కేసులు 767. కాగా.. కోయంబేడు లింకుల ద్వారా చిత్తూరులో 5, నెల్లూరులో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలుగా కృష్ణా జిల్లాలో ఒక్కరు మరణించారు. ఇప్పటి వరకూ మొత్తం 56 మంది మరణించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే గత నాలుగైదు రోజులుగా కొన్ని జిల్లాల్లో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *