Breaking News
Home / States / 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం…!

48 గంటల్లో తుపానుగా మారే అవకాశం…!

హైదరాబాద్: అరేబియా మహా సముద్రంలో మాల్దీవులు, కోమరన్ ప్రాంతాలను ఆనుకుని నైరుతి దిశలో వాయుగుండం పయనిస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మాల్దీవులకు ఉత్తర ఈశాన్య దిశగా 450 కిలోమీటర్లలో మినికాయ్‌కి తూర్పు ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరంలో తిరువనంతపురానికి పశ్చిమ నైరుతి దిశగా 220 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై కొనసాగుతోందని చెప్పారు. ఇది వాయువ్య దిశగా కదులుతూ లక్ష ద్వీప్ వైపు వెళ్తోందన్నారు. రాబోయే 24 గంటల్లో బలపడి తీవ్ర వాయుగుండగా మారనుందన్నారు. 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

మరోవైపు అరేబియా మహాసముద్రంలో తీవ్ర తుపాను కొనసాగుతోంది. దీని ప్రభావంతో ప్రస్తుతం కేరళ, తమిళనాడులో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా, రాయలసీమలోనూ పలు చోట్ల ఒక మోస్తారు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు తెలంగాణలో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *