Breaking News
Home / National / జల్లికట్టులో అపశృతి.. 49మందికి గాయాలు

జల్లికట్టులో అపశృతి.. 49మందికి గాయాలు

చెన్నై: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తమిళ సంప్రదాయ సాహస క్రీడ జల్లికట్టు పోటీలను నిర్వహించడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వ‌స్తోన్న సంగతి తెలిసిందే. ప్రతీ ఏడాదీ ఈ పోటీలు ఉత్సాహంగా సాగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం పోటీలు నిర్వహించుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మధురై జిల్లా అవనీయాపురంలో పోటీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ప్రారంభమైన ఈ పోటీల్లో ఇప్పటి వరకూ 49మందికి గాయాలయ్యాయని.. మరో నలుగురికి చిన్నపాటి గాయాలయ్యాయని స్థానికులు చెబుతున్నారు. గాయాలపాలైన వారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని నటరాజు అనే స్థానికుడు మీడియాకు వివరించారు.

కాగా.. అవనియాపురం అనే ప్రాంతం జల్లికట్టుకు ఫేమస్. సంక్రాంతి రోజున, కానుంపొంగల్‌ రోజున పాలమేడులో, మూడో రోజున అలంగా నల్లూరులో ఈ పోటీలు అట్టహాసంగా జ‌ర‌గుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. జల్లికట్టులో మొత్తం 600 ఎద్దులను అదుపు చేయడానికి 1000 మంది యువకులు పోటీపడుతున్నారని తెలుస్తోంది. జల్లికట్టు జరిగే చోట వైద్య బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పోటీల్లో 18 నుంచి 40ఏళ్ల లోపు వారు మాత్రమే పాల్గొనాల్సి ఉంది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఓ వైపు జల్లికట్లు నిర్వహిస్తుంటే.. మరోవైపు ప్రేక్షకులు కేరింతలు కొడుతూ జల్లికట్టును ఎంతో ఉత్సాహంగా వీక్షిస్తున్నారు.

Check Also

పారిస్‌లో మోదీకి ఘనస్వాగతం

Share this on WhatsAppపారిస్: ఫ్రాన్స్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పారిస్‌లోని చార్లెస్ డె గౌలె ఎయిర్‌పోర్ట్‌లో ఘన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *