న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి జమ్మూకాశ్మీర్ మినహా ఇతర రాష్ట్రాలకు వలస వచ్చిన 5000 కుటుంబాలను జమ్మూకాశ్మీర్ నిర్వాసితుల జాబితాలో చేర్చి వారికి రూ 5.5 లక్షల పరిహారం అందిస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. ప్రధాన మంత్రి అభివృద్ధి ప్యాకేజ్ కింద ఆయా కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఈ కుటుంబాలు జమ్మూకాశ్మీర్ మినహా ఇతర రాష్ట్రాల్లో స్ధిరపడటంతో వారి పేర్లు నిర్వాసితుల జాబితాలో లేవని వారి పేర్లను చేర్చడం ద్వారా గతంలో జరిగిన చారిత్రక తప్పిదాన్ని తమ ప్రభుత్వం సవరిస్తోందని చెప్పుకొచ్చారు. జమ్మూకాశ్మీర్ అభివృద్ధి కోసం ప్రకటించిన ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజ్‌ను కశ్మీర్లో పలు ప్రాజెక్టుల అమలుకు వెచ్చిస్తున్న సంగతి తెలిసిందే.
