Breaking News
Home / National / మెట్రో రైల్లో ఇకపై 50 శాతం డిస్కౌంట్…

మెట్రో రైల్లో ఇకపై 50 శాతం డిస్కౌంట్…

చెన్నై: ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు ఇకపై సెలవు దినాల్లో 50 శాతం ప్రత్యేక డిస్కౌంట్ ఇవ్వాలని చెన్నై మెట్రో రైల్ యాజమాన్యం యోచిస్తున్నట్టు సమాచారం. చెన్నై మెట్రోలో రోజుకు సగటున 1.2 లక్షల మంది ప్రయాణిస్తుండగా… ఆదివారాలు, సెలవు దినాల్లో ఈ సంఖ్య అమాంతం 70 వేలకు పడిపోతోంది. దీంతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు మెట్రో యాజమాన్యం ఆదివారాలు, సెలవు దినాల్లో టికెట్ ధరపై 50 శాతం తగ్గింపును అమలు చేయాలని యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ డిస్కౌంట్ కొన్ని నెలల పాటు లేదా ఓ సంవత్సరం పాటు కొనసాగిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తుది దశకు చేరుకోగా.. త్వరలోనే చెన్నై మెట్రో రైల్ బోర్డు ముందుకు చేరనున్నాయి.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *