Breaking News
Home / social media / 50 వేల లైక్స్ పొందిన టీఎంసీ ఎంపీ ఫోటో….

50 వేల లైక్స్ పొందిన టీఎంసీ ఎంపీ ఫోటో….

తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ నుస్రత్‌ జహాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ‘షేడ్స్ ఆఫ్ లైఫ్’ అని రాశారు. అలాగే కామెంట్ బాక్సులో తోటి పార్లమెంట్ సభ్యురాలు మిమి చక్రవర్తిని ‘నేను మేకప్ సరిగా చేసుకున్నానా?’ అని ప్రశ్నించారు. అయితే దీనికి ఇప్పటి వరకూ మిమి చక్రవర్తి సమాధానం ఇవ్వకపోయినప్పటికీ, నెటిజన్లు నుస్రత్‌ జహాన్ ఫోటోను చూసి రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోకు ఇప్పటి వరకూ 50 వేలకు మించిన లైక్స్ వచ్చాయి. కొందరు ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్లు చేస్తుండగా, మరికొందరు ఇలాంటి ఫోటోలు షేర్ చేసే బదులు మీ పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం మంచిదని సలహాలిస్తున్నారు.

Check Also

కరోనా కోసం ఫేస్‌బుక్‌లో కొత్తగా రెండు ఎమోజీలు

Share this on WhatsAppప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పూర్తిగా విస్తరించింది. దీని కట్టడికి వ్యాక్సిన్ కూడా లేకపోవడంతో.. అదుపు చేయడం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *