సూర్యాపేట: హుజూర్నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 2,36,842 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంటకు 52 శాతం ఓటింగ్ నమోదయింది. నేరేడుచర్ల మండల పరిధిలోని పోలింగ్ బూత్‌లు 30, 31లో ఈవీఎంలు మొరాయించడంతో కొంచెం ఆలస్యంగా పోలీంగ్ ప్రారంభమైంది. చింతలపాలెం పోలింగ్ బూత్ 168, చింతకుంట పోలీస్ బూత్8లో వెలుతురు సరిగా లేక ఓటర్లు కొద్దిసేపు ఇబ్బంది పడ్డారు. చింతలపాలెం పోలింగ్ బూత్‌లో ఓ యువకుడు ఓటువేస్తూ సెల్ఫీ తీసుకుంటుండగా గుర్తించిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ప్రాంతాల్లో పోలీంగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
