Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఏపీలో కొత్తగా 56 కరోనా కేసులు …

ఏపీలో కొత్తగా 56 కరోనా కేసులు …

అమరావతి : ఆంధ్రప్రదేశ్ కరోనా మహమ్మారి ఉధృతి తగ్గట్లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ విడుదల చేసిన మీడియా బులెటిన్‌లో పేర్కొంది. ఇవాళ నమోదైన కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1833కు చేరుకుంది. ఇప్పటివరకు 780 మంది కరోనాను జయించి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇంతవరకూ 38 మంది మృతిచెందారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. 1015 మందికి పలు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. ఇవాళ కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.

జిల్లాల వారీగా లెక్కలివీ..

గడిచిన 24 గంటల్లో 8,087 శాంపిల్స్ పరీక్షించగా 56 మందికి పాజిటివ్ అని తేలింది. కృష్ణాలో 16, గుంటూరు 10, కర్నూలు, విశాఖలో కొత్తగా 7 చొప్పున కేసులు నమోదయ్యాయి. నెల్లూరులో 4, కడప 6, అనంతపురం, విజయనగరంలో 3 చొప్పున కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *