న్యూఢిల్లీ : ఢిల్లీ జూపార్కులో అత్యంత వృద్ధ చింపాంజీ(59) మృతి చెందింది. గత రెండు నెలల నుంచి చింపాంజీ రీటా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. జులై 27వ తేదీ నుంచి చింపాంజీ సరిగ్గా ఆహారం తీసుకోవడం లేదు. కేవలం పానీయాలు మాత్రమే తీసుకుంటుంది. నాటి నుంచి చికిత్స పొందుతున్న రీటా కన్నుమూసినట్లు జూ క్యూరేటర్ చెప్పారు. శరీరంలోని అవయవాలు దెబ్బతినడం వల్లే చింపాంజీ మృతి చెందినట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. ఈ చింపాంజీ డిసెంబర్ 12, 1960లో అమ్స్టార్డామ్లో జన్మించగా.. ఢిల్లీ జూపార్కుకు 1990లో తీసుకువచ్చారు.
