Breaking News
Home / Lifestyle / Business / 6.5 లక్షల జీతాన్ని వదిలి వ్యవసాయం చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

6.5 లక్షల జీతాన్ని వదిలి వ్యవసాయం చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంటేనే సుఖమైన ఉద్యోగం. ఒళ్లు వంచి కష్టపడాల్సిన అవసరం లేదు. ఏసీలో కూర్చొని పనిచేయొచ్చు. జీతం కూడా లక్షల్లో ఉంటుంది. అంతకంటే ఇంకేం కావాలి ఎవరికైనా చెప్పండి. కానీ.. ఈ యువకుడు మాత్రం ఆ సుఖమైన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేశాడు. సంవత్సరానికి 6.5 లక్షల జీతం వస్తున్నా వద్దనుకున్నాడు. సాఫ్ట్‌వేర్ జాబ్‌ను సాఫ్ట్‌గా వదిలేశాడు. ఇప్పుడు వ్యవసాయం బాట పట్టాడు. ఉద్యోగం ద్వారా వచ్చిన శాలరీ కంటే ఎక్కువ ఇప్పుడు సంపాదిస్తున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.. ఆ వ్యక్తే అనుప్ పాటిల్.

రెండేళ్ల క్రితం పుణెలో పనిచేస్తున్న ఐటీ జాబ్‌కు రాజీనామా చేసి ఇప్పుడు సంవత్సరానికి 20 లక్షలు సంపాదిస్తున్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేసిన మూడు నెలల వరకు ఎవరికీ చెప్పకుండా గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్లి అక్కడి రైతులను కలిశాడు. వ్యవసాయంలో మెళకువలను నేర్చుకున్నాడు. రీసెర్చ్ చేశాడు. అలా వ్యవసాయానికి సంబంధించి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. మూడు నెలల తర్వాత మహారాష్ట్రలోని సంగ్లి జిల్లాలో ఉన్న తన గ్రామం నగ్రాలెకు వచ్చి వ్యవసాయం చేస్తున్నాడు.

ఇప్పుడు తన 12 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ద్వారా 12 మందికి ఉపాధి కల్పించాడు. క్యాప్సికమ్, స్వీట్ కార్న్, చెరుకు, బంతిపూలను పెంచి సంవత్సరానికి 20 నుంచి 25 లక్షల దాకా సంపాదిస్తున్నాడు.

అయితే.. అనుప్ వ్యవసాయం చేయడం ప్రారంభించగానే అన్నీ ఆయనకు అనుకూలంగా ఏమీ జరగలేదు. ఎన్నో సమస్యలు.. ఎంతో మంది ఎత్తిపొడుపు మాటలు.. ఇలా చాలా అనుభవించాడు. వ్యవసాయంలో అనుభవం లేకున్నా.. తను రైతుల నుంచి నేర్చుకున్న విషయాలనే అనుభవాలుగా మార్చుకొని వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు సక్సెస్‌ఫుల్ ఫార్మర్ అయ్యాడు. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా.. కొత్త కొత్త విధానాలతో వ్యవసాయం చేస్తూ లక్షలు గడిస్తున్న అనుప్‌ను చూసి అక్కడి రైతులు కూడా అవే పద్ధతులను ఫాలో అవుతున్నారట. వావ్.. సూపర్ అనుప్. వ్యవసాయంలో అడుగుపెట్టి దేశానికి అన్నం పెట్టాలని ఆశిస్తున్న ప్రతి వ్యక్తికి నువ్వు ఆదర్శం అనుప్.

Check Also

సభలో కలతచెందిన సోనియాగాంధీ

Share this on WhatsAppన్యూఢిల్లీ: రాఫెల్ డీల్‌పై దేశాన్ని తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *