అహ్మదాబాద్: జునాగఢ్ జిల్లాలో బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మలంకా గ్రామానికి సమీపంలో ఉన్న 60 అడుగుల పొడవైన బ్రిడ్జి కూలిపోగా..ఆ మార్గం వెంబడి వెళ్తున్న వాహనాలు వంతెన శితిలాల కింద ఇరుక్కుపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్యూ టీం శిథిలాల కింద ఉన్న రెండు బైకులు, మూడు కార్లను బయటకు తీశారు. వంతెన కూలడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అధికారులు వాహనాలను దారిమళ్లిస్తున్నారు.
