Breaking News
Home / World / 64 లక్షలు దాటిన కరోనా కేసులు…

64 లక్షలు దాటిన కరోనా కేసులు…

ప్రపంచవ్యాప్తంగా కరోనా కరోనా పంజా విసురుతూనే ఉంది. దీంతో ప్రపంచ దేశాలు వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 64 లక్షలు దాటాయి. బ్రెజిల్‌లో వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రష్యాలో కరోనా విజృంభిస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 64,52,390 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,82,479 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి 30,66,696 మంది కోలుకున్నారు.

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో గత 24 గంటల్లో మొత్తం 18,81,205 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1,08,059 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 6,45,974 మంది కోలుకున్నారు. బ్రెజిల్‌లో వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో మొత్తం 5,52,237 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 31,309 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 2,40,627 మంది కోలుకున్నారు. అలాగే స్పెయిన్‌లో గత 24 గంటల్లో మొత్తం 2,87,012 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 27,127 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 1,96,958 మంది కోలుకున్నారు. రష్యాలో గత 24 గంటల్లో మొత్తం 4,23,741 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 5,037 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 1,86,985 మంది కోలుకున్నారు.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *