Breaking News
Home / States / Andhra Pradesh / 7 బస్సుల్లో తెలంగాణాకు..

7 బస్సుల్లో తెలంగాణాకు..

నెల్లూరు/ఏఎస్‌పేట: లాక్‌డౌన్‌కు ముందు ఏఎస్‌పేట దర్గాకు వచ్చి ఇక్కడే ఉండిపోయిన యాత్రికులు తమ స్వస్థలాలకు పయణమయ్యారు. గ్రామంలో సుమారు 350 మంది యాత్రికులు ఉండగా, వారిలో తెలంగాణకు చెందిన వారినే అధికారులు గుర్తించి కరోనా పరీక్షలు చేయించారు. ఉన్నతాధికారుల అమనుమతితో ఏడు బస్సుల్లో 180 మందిని పంపించారు. ఇందుకోసం తెల్లవారుజాము 4 గంటల నుంచే ఆత్మకూరు ఆర్డీవో ఉమాదేవి, సీఐ పాపారావు, తహసీల్దారు లక్ష్మీనరసింహ, ఎస్‌ఐ గోపాల్‌, ఎంపీడీవో రజనీకాంత్‌, ఆర్‌ఐ ప్రదీప్‌ తదితరులు దగ్గరుండి మరీ యాత్రికులను అన్ని సౌకర్యాలతో సాగనంపారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌ తదితర ప్రాంతాలకు చెందిన వారిని కూడా త్వరలోనే పంపనున్నట్లు అధికారులు తెలిపారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *