హైదరాబాద్: హుజుర్నగర్ ఉపఎన్నికకు మొత్తం 76 నామినేషన్లు, 119 సెట్లు దాఖలయ్యా యి. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు. నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరి తేదీ కావడంతో పెద్దసంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఆఖరు రోజు ర్యాలీగా వచ్చి నామినేషన్లు వేశారు. కాగా ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్ అభ్యర్ధిగా సైదిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా పద్మావతి, టీడీపీ అభ్యర్ధిగా చావా కిరణ్మయి, బీజేపీ నుంచి కోట రామారావు, సీపీఎం అభ్యర్ధిగా పారేపల్లి శేఖరరావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహకరణకు అక్టోబరు 3వ తేదీ వరకు గడువుంది.
