Breaking News
Home / States / శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేత

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేత

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. దీంతో అధికారులు 8 గేట్లు ఎత్తి 25వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. గత రెండు రోజులుగా ఈ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వస్తోంది. ప్రస్తుతం 60వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1090 అడుగులకుపైగా నీటిమట్టం కొనసాగుతోంది. ఇన్‌ఫ్లోనుబట్టి మరిన్ని గేట్లను ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *