Breaking News
Home / National / శ్రామిక్ రైళ్లలో 80 మంది వలసకార్మికుల మృతి..

శ్రామిక్ రైళ్లలో 80 మంది వలసకార్మికుల మృతి..

న్యూఢిల్లీ : దేశంలో లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు తరలించేందుకు మే 9 నుంచి 27వతేదీ వరకు రైల్వేశాఖ నడిపిన శ్రామిక్ స్పెషల్ రైళ్లలో 80 మంది వలసకార్మికులు మరణించారని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సమీక్షలో వెల్లడైంది.రైల్వేశాఖ మే 1నుంచి 27వతేదీ వరకు దేశంలో 3,840శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడిపి 5 మిలియన్ల మంది వలసకార్మికులకు వారి స్వస్థలాలకు చేర్చింది. శ్రామిక్ రైళ్లలో ఆకలి, వేడి వల్ల పలువురు వలసకార్మికులు రైళ్లలోనే మరణించారు. దీర్ఘకాల జబ్బులతో బాధపడుతున్న వలసకార్మికులు రైలు ప్రయాణంలో మరణించారని రైల్వే శాఖ ప్రకటించింది. శ్రామిక్ రైళ్లలో 80 మంది మరణించారని రైల్వే అధికారిక ప్రతినిధి వెల్లడించారు. రైళ్లలో ప్రయాణికులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే రైలును ఆపి వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని రైల్వేబోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ చెప్పారు. రైళ్లలో భోజనం దొరక్క ఎవరూ మరణించలేదని రైల్వేబోర్డు ఛైర్మన్ చెప్పారు.

Check Also

త్వరలో ఇంటి సహాయకులు, ఆటోవాలాలు, రోజువారీ కూలీలకు కరోనా పరీక్షలు

Share this on WhatsAppదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. ఢిల్లీలో పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపధ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *