Breaking News
Home / National / బిహార్‌లో పిడుగుల బీభత్సం.. 83 మంది మృతి

బిహార్‌లో పిడుగుల బీభత్సం.. 83 మంది మృతి

బిహార్‌లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఏకంగా 83 మంది ప్రాణాలు బలిగొన్నాయి. నిన్న ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవడంతో… దాదాపు అన్ని జిల్లాల్లో పిడుగుల బీభత్సం కొనసాగింది. ఉదయం నుంచి రాత్రి వరకు మృతుల సంఖ్య పెరుగూతూనే పోయింది. బిహార్‌లో పిడుగుల వల్ల 83 మంది చనిపోయారని… రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటించింది. జిల్లాల వారీగా చూస్తే… గోపాల్‌గంజ్‌లో అత్యధికంగా 13 మంది పిడుగుపాటుకు గురై మృత్యువాతపడ్డారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రుల్లో చేర్చారు. ఎక్కువ మంది పొలాల్లో పనిచేస్తుండగా ఈ ప్రమాదాలకు గురయ్యారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *